telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఒంటె కింద మహిళ… తప్పించుకోవడానికి ఏం చేసిందంటే ?

Camel

అమెరికాలోని లూసియానా రాష్ట్రం గ్రోస్ టేట్‌లో గల టైగర్ ట్రక్ స్టాప్ జూలో సోమవారం వింత సంఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన ఓ జంట తమ పెంపుడు కుక్కతో కలిసి జూకు వెళ్లింది. అనంతరం వారు ఒంటె ఉన్న ఎన్‌క్లోజర్‌ దగ్గరికి వెళ్లారు. ఇక కుక్కను చూసిన ఒంటె దానిపై విరుచుకుపడింది. దీంతో ఒంటె నుంచి శునకాన్ని రక్షించేందుకు చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను దాటి ఆ జంట ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించింది. అనంతరం కుక్కను కాపాడానికి వ్యక్తి ఒంటెను కొట్టడం ప్రారంభించాడు. దీంతో వారిద్దరిని ఒంటె పక్కకు తోసేసింది. ఈ క్రమంలో మహిళ కిందపడడం.. అదే సమయంలో ఒంటె ఆమెపై కూర్చోవడం జరిగిపోయింది. పక్కనే ఉన్న భర్త.. భార్యను ఒంటె కింద నుంచి లాగేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దాంతో తనను తాను కాపాడుకోవడానికి బాధిత మహిళ ఒంటె జననాంగాలను గట్టిగా కోరికేసింది. అంతే.. మహిళ చర్య కారణంగా బాధతో విలవిలలాడిన ఒంటె దెబ్బకు పక్కకు జరిగింది. వెంటనే ఆమె అక్కడి నుంచి బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న జూ సిబ్బంది పశువుల వైద్యులను పిలిపించి ఒంటెకు చికిత్స చేయించారు. ఒంటెకు ఏమీ కాలేదని వైద్యులు చెప్పడంతో జూ సిబ్బంది ఊపిరిపీల్చుకుంది. స్వల్పంగా గాయపడిన ఒంటెకు ముందుజాగ్రత్తగా వైద్యులు యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త బయటకు రావడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Related posts