telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీహార్ : ఎన్డీయే వైపు మొగ్గు చూపించిన ప్రజలు…

బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది.  ఇప్పటికే ఎన్డీయే లీడింగ్ లో కొనసాగుతోంది.  తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే 123 స్థానాల్లో మహాకూటమి 111 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.  అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ మార్క్ ను ఎన్డీయే కూటమి దాటింది.  ఎన్నికలు పూర్తైన వెంటనే ఎగ్జిట్ పోల్స్ తమ సర్వే వివరాలను బయటపెట్టాయి.  దైనిక్ భాస్కరన్ మినహా అన్ని ఎగ్జిట్ పోల్స్ మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి.  అయితే, వస్తావ ఫలితాలు దానికి విరుద్ధంగా ఉన్నట్టుగా ప్రస్తుతం వస్తున్న ఫలితాలను బట్టి అర్ధం అవుతున్నది.  అయితే, ఎన్డీయే, మహాకూటమి మధ్య తేడా స్వల్పంగా ఉంటె చిన్న పార్టీలు, స్వతంత్ర పార్టీల మద్దతు అనివార్యం అవుతుంది. అయితే బీహార్ లో ఎన్నికల ఫలితాలు నిదానంగా వస్తున్నాయి.  బీహార్ ప్రజలు ఎన్డీయే వైపుకు మొగ్గు చూపారు అన్నది స్పష్టం అవుతున్నది.  అయితే, గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి ప్రతిపక్షంలో ఉన్న  మహాకూటమికి ఎక్కువ ఇచ్చినట్టు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. అయితే, నితీష్ కుమార్ జేడీయూ ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయింది. ఎన్డీయే కూటమిలోని బీజేపీ 72 చోట్ల లీడింగ్ కనబరచడం విశేషం.  బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. 

Related posts