telugu navyamedia
సినిమా వార్తలు

68 సంవత్సరాల “జయంమనదే”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్రం రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి “జయంమనదే” సినిమా 04-05-1956 విడుదలయ్యింది.

నిర్మాత సుందర్ లాల్ నహతా రాజశ్రీ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రఖ్యాత దర్శకుడు తాతినేని ప్రకాశరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: టి.ప్రకాశరావు, కథ: ప్రత్యగాత్మ, మాటలు: ముద్దు కృష్ణ, పాటలు: కొసరాజు ,సముద్రాల రాఘవాచార్య సీనియర్, ముద్దుకృష్ణ,జంపన, వెంపటి సదాశివబ్రహ్మం, సంగీతం: ఘంటసాల, ఫోటోగ్రఫీ: కమల్ గోష్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, కళ: వాలి, ఎడిటింగ్: తిలక్, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, అంజలీదేవి, సి.యస్.ఆర్., షావుకారు జానకి, గుమ్మడి, రేలంగి, ఆర్.నాగేశ్వరరావు, పెరుమాళ్ళు, మీనాకుమారి తదితరులు నటించారు.

ప్రముఖ నేపథ్యగాయకులు ఘంటసాల గారి సంగీత సారధ్యంలో
“ఓ చందమామ అందాలభామ ఎందున్నదో”
“చూడచక్కని చుక్కా చురుకుచూపు లెందుకే”
“వినవోయి బాటసారి కనవోయి ముందుదారి” “దేశభక్తిగల అయ్యలారా”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

దర్శకుడు తాతినేని ప్రకాశరావు గారి అసిస్టెంట్లు  వి.మధుసూదనరావు, కె.ప్రత్యగాత్మ లు ఈ చిత్రానికి సహాయ దర్శకులు గా పని చేశారు. దర్శకుడు కె. విశ్వనాథ్ గారు ఈ సినిమాకు సౌండ్ విభాగంలో పనిచేసారు.

ఈ జానపద చిత్రరాజం ఘన విజయం సాధించి విడుదలైన దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు,
11 కేంద్రాలలో (7 డైరెక్ట్ + 4 షిఫ్ట్) 100 రోజులు ప్రదర్శింపబడింది…
100 రోజులు ఆడిన కేంద్రాలు:-
1.విజయవాడ — శ్రీరామా టాకీస్(126 రోజులు)
2.గుంటూరు — సరస్వతి టాకీస్,
3.తెనాలి — రత్నా టాకీస్,
4.మచిలీపట్నం — దుర్గా మహల్,
5.చీరాల — గోపాలకృష్ణ,
6.ఏలూరు — శేష మహల్,
7. భీమవరం — స్వామీజీ టాకీస్,
8.రాజమండ్రీ — శ్రీరామా (98 రోజులు) + షిఫ్ట్
9.కాకినాడ — లక్ష్మి (98 రోజులు) + షిఫ్ట్
10. నెల్లూరు — కొత్త హాల్ (98 రోజులు) + షిప్ట్
11.విజయనగరం — మినర్వా (98 రోజులు) + షిఫ్ట్
ఈ సినిమాను తమిళంలో కి డబ్బింగ్ చేసి “వెట్రి వీరన్” పేరు తో 1956 లో విడుదల చేయగ అక్కడ కూడా విజయవంతమైనది.

Related posts