telugu navyamedia
సినిమా వార్తలు

లాక్‌డౌన్ శాశ్వత పరిష్కారం కాదు… మందులు కనిపెట్టండి…

narayana

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాలకు సెల్యూట్ చేశారు. దశలవారీగా ఈ లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ఆయన కోరారు. లాక్‌డౌన్ ఎత్తేసినా కరోనాని జయించగలిగాం అనే భరోసాని ప్రజలకు ప్రభుత్వాలు కల్పించే దిశగా అడుగులు వేయాలని.. ఓ వీడియో ద్వారా నారాయణమూర్తి తెలిపారు. మన నాయకులు దూరదృష్టితో పెట్టిన ఈ లాక్‌డౌన్‌ను నిజంగా మనకోసమే అన్నట్టు అమలుచేస్తున్నాం. శభాష్.. అయితే నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ లాక్‌డౌనే ఒక మంత్రం కాదు. లాక్‌డౌనే శాశ్వత పరిష్కారం కాదు. ముందు మందులు కనిపెట్టి మనల్ని రక్షిస్తూ.. ఎప్పుడైతే మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను అంచెలంచెలుగా సడలింపు చేస్తూ.. లాక్‌డౌన్‌ను ఎత్తేసి కూడా ఈ కరోనా మహమ్మారిని జయించగలుగుతున్నాం, మనం బతకగలుగుతున్నాం అనే భరోసాని మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. మనిషి స్వేచ్ఛాజీవి. బతకాలి. ఈ దశలో మనిషి బతకాలంటే, స్వేచ్ఛగా విహరించాలంటే.. అలాగని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కాదు.. ప్రభుత్వాలు పెట్టిన నియంత్రణను పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ బతకగలుగుతున్నాం అనే భరోసాని ప్రభుత్వాలు తీసుకురావాలి. అలా తీసుకురాలేకపోతే ఓడిపోయినట్టే. ఇప్పటికే ఎందరో ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారందరికీ సెల్యూట్

 

Related posts