telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ ప్రేమకు .. హద్దులుండవా.. !

TV actress public kiss to his lover

నటిగా హిందీ టీవీ రంగంలో పాపులరైన అంకిత లోఖండే… ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఒకప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో లాంగ్ టైమ్ రిలేషన్ కొనసాగించిన ఈ బ్యూటీ ఆ తర్వాత అతడితో విడిపోయిన సంగతి తెలిసిందే. సుశాంత్ టీవీ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసే క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అంకిత లోఖండే సైతం ఇటీవలే ‘మణికర్ణిక’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇటు బాలీవుడ్లో కెరీర్ ప్రారంభం అవ్వడంతో పాటు బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారి విక్కీ జైన్‌తో ప్రేమలో పడటం ద్వారా జీవితాన్ని మరింత హ్యాపీగా లీడ్ చేస్తోంది.

అంకిత, విక్కీ జైన్‌ మధ్య ఎఫైర్ గురించి అంకిత కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. ”నేను ప్రేమలో పడ్డమాట నిజమే. అతడు చాలా మంచి వ్యక్తి. బిలాస్‌పూర్‌కు బిజినెస్ మ్యాన్. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను” అని హింట్ ఇచ్చారు. ఇటీవల అంకిత, విక్కీ జైన్‌ ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రియుడిని పబ్లిగ్గా ముద్దు పెట్టడం ద్వారా ఇతడే నా సర్వస్వం అనే మెసేజ్ అభిమానుల్లోకి పంపింది అంకిత. వీరి ముద్దు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంటను బ్లెస్ చేస్తూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

#ankitalokhande with boyfriend #Vicky #kissingvideo

A post shared by Chauthi Duniya (@chauthi_duniya) on

Related posts