telugu navyamedia
సాంకేతిక

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త

whats-app

ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సాప్ మరో ఆసక్తికరమైన ఫీచర్ తీసుకురానుంది. వా బేటా ఇన్ఫో అందించి సమాచారం ప్రకారం వీడియో, ఆడియో కాలింగ్ లో పాల్గొనే యూజర్ల పరిమితిని పెంచడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్‌ కు ఆదరణ భారీగా పెరిగిన నేపథ్యంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డార్క్ మోడ్, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌లాంటి ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్ పరిమితిని పెంచేందుకు యోచిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తున్న సమయంలో వీడియో కాలింగ్ సదుపాయానికి డిమాండ్ బాగా పెరిగింది. గ్రూపు ఆడియో, వీడియో కాలింగ్ వైపు మళ్లిన తరుణంలో వాట్సాప్ ఈ కీలక మార్పును తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. లాక్ డౌన్ కాలంలో జూమ్, గూగుల్ డియో యాప్స్ లో ఒకేసారి డజన్ల కొద్దీ వ్యక్తులతో వీడియో కాలింగ్‌ను అనుమతి లభిస్తోంది. వాట్సాప్ లో ప్రస్తుతానికి గ్రూప్ ఆడియో, వీడియో కాలింగ్ లో పాల్గొనడానికి నలుగురి మాత్రమే అనుమతి వుంది. దీంతో వాట్సాప్ తాజా అప్ డేట్ తీసుకురానుంది.

Related posts