telugu navyamedia
సినిమా వార్తలు

“ఆపరేషన్ గోల్డ్ ఫిష్”ను ప్రసాద్ ఐమాక్స్‌లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తా… : అడివిశేష్

adivi-sesh

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ. బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘మనం ఒక పని చేస్తే, ఆ పనికి విలువ ఉందని ప్రజలకు గుర్తుండి పోయేలా చేయడం చాలా కష్టమైన విషయం. మనకు క్రెడిబిలిటీ రావాలి. అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాకు పని చేసిన వాళ్ళు అందరూ నాకు ఫ్యామిలీతో సమానం. ఈ సినిమాకు ఒక క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ వచ్చాయి. అక్టోబర్ 18న ప్రసాద్ ఐమాక్స్‌లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. నాతోపాటు ప్రేక్షకులందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘సాయికుమార్, సురేఖ దంపతుల బదులు రాజశేఖర్‌గారు, నేను వచ్చాం‌. వాళ్ళిద్దరికీ ఆది ఎంతో… మాకు అంతే. ‌ ఇప్పుడు మా అమ్మాయిలు ఇద్దరు నటిస్తున్నారు. వాళ్ళ సినిమాలు విడుదలైతే నేను ఎంత టెన్షన్ పడతామో… ఆది సినిమా విడుదలైనా అలాగే ఫీల్ అవుతాం. ఇక్కడికి వచ్చాక ఈ సినిమా కథ గురించి తెలిసింది. సైనికుల త్యాగాల గురించి తెలుసుకున్నా. సైనికుల పోరాటాలు, మరణాల గురించి పేపర్లలో చదివి ఊరుకోవడం కాదు అంతకు మించి ఆలోచించాలనే ఆలోచనను ఇందులోని దేశభక్తి గీతం కలిగించింది‌. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది గెటప్ చాలా బాగుంది. ఇప్పటివరకు అతడిని లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా చూ‌‌శాం. కానీ, ఆర్మీ అధికారిగా చాలా బాగా చేశాడు’’ అన్నారు. ‌

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘టైటిల్ అద్భుతంగా ఉంది. ఆర్టికల్ 370 హీట్‌లో ప్రజలందరూ ఉన్న సమయంలో ఈ సినిమా విడుదల అవుతోంది. సరైన సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

Related posts