telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెంకీ మామ తో .. రామ్ చరణ్ దంపతులు..

ramcharan couple at venkatesh daughter event

విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత ..హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిల వివాహం నేటి సాయంత్రం జయపురలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ నిన్న ప్రీ వెడ్డింగ్ వేడుకలని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, చైతూ, సమంతో పాటు చెర్రీ, ఉపాసన కూడా హాజరయ్యారు.

నూతన దంపతులతో చెర్రీ, ఉపాసన కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ ఫోటోలో వెంకటేష్‌, ఆయన శ్రీమతి కూడా ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం జరిగిన సంగీత్‌లో సమంత, చైతూలు తమ స్టెప్పులతో అదరగొట్టేశారట. ఈ రోజు జరగనున్న పెళ్లి కార్యక్రమానికి టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఆశ్రిత, వినాయక్ ల నిశ్చితార్ధం ఫిబ్రవరి 6న గోప్యంగా జరిగిన సంగతి తెలిసిందే.

Related posts