telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3పై మహేష్ విట్టా షాకింగ్ కామెంట్స్

mahesh vitta will leave from house

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్రమం ముగింపు దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో షో విన్నర్ ఎవరో తేలిపోనుంది. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 12వ వారం ఇంటి నుండి వరుణ్ సందేశ్ భార్య వితికా ఎలిమినేట్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిస్‌పేట్ చేసిన కొందరు కంటెస్టంట్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ షో ఫై సంచలన కామెంట్స్ చేసాడు మహేష్ విట్టా. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమేట్ అయినా మహేష్..బిగ్ బాస్ నిర్వాహకులు కొందరి పట్ల పక్షపాతంగా ఉంటున్నారని ఆరోపించాడు. యాంకర్ శ్రీముఖికి మాత్రం పరోక్షంగా ఫేవర్ చేస్తూ ఆమె హౌస్ లో కొనసాగేలా సహాయం చేస్తున్నారంటూ మహేష్ విట్ట చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చివరికి బిగ్ బాస్ 3 టైటిల్ శ్రీముఖి గెలిచినా ఆశ్చర్యం లేదన్నాడు. అయితే గతంలో కూడా శ్రీముఖి పై కొందరు ఇలాంటి ఆరోపణలే చేశారు. తాజాగా మహేష్ కూడా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం బిగ్ బాస్ ప్రేక్షకుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Related posts