telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ముషారఫ్‌ .. మరణించినా సరే .. మూడు రోజులు వేలాడతీయండి. : పాక్ కోర్ట్

pak ex president musharaf hospitalized

పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు రాజద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించిన తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించింది. మరణ శిక్ష అమలు చేసేలోపు ముషారఫ్ చనిపోతే.. ఆయన మృతదేహాన్ని పార్లమెంటుకు ఈడ్చుకురావాలని ఆదేశించింది. పార్లమెంటు బయట మూడు రోజుల పాటు వేలాడదీయాలంటూ సంచలన తీర్పు వెలువరించింది. పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక కోర్టు ధర్మాసనం ముషారఫ్‌పై మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పునకు సంబంధించి 169 పేజీల పూర్తి పాఠాన్ని ఇవాళ విడుదల చేసింది.

2007 నవంబరు 3న దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించినందుకు ఆయనకు ఈ శిక్ష విధిస్తున్నట్లు ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 6 ప్రకారం ఇలా దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసినా, సస్పెండ్‌ చేసినా, దానికి తూట్లు పొడిచినా.. దేశద్రోహం కిందకు వస్తుంది. నవాజ్‌ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్‌(ఎన్‌) ప్రభుత్వం 2013లో ఆయనపై ఈ రాజద్రోహం కేసు నమోదు చేసింది.

Related posts