సొంత సంస్కృతీ పాటించడం కష్టమని, పబ్ లకు అలవాటుపడిపోయి నేరాలకు దారులు వేస్తున్నట్టుగా ఉంది ప్రధాన నగరాల పరిస్థితి. ఇదే సందుగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అమ్మాయిలను ఎరగా వేసి తమ ఆదాయం పెంచుకునేందుకు రెస్టారెంట్ అండ్ పబ్ చేస్తున్న అభ్యంతరకర వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న లిస్బన్ రెష్టారెంట్ అండ్ పబ్ లో జరగుతున్న ఈ గలీజ్ దందా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. గత అర్ధరాత్రి సమయంలో లిస్బన్ పబ్ పై పోలీసులు దాడి చేశారు. 30 మందికి పైగా యువతీ, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రెస్టారెంట్ అండ్ పబ్ కు వచ్చే యువకులను ఆకర్షించేందుకు అమ్మాయిలతో అశ్లీల పనులు చేయిస్తున్నట్టు పోలీసుల సమాచారం. పబ్ యాజమాన్యం ప్రోద్బలం మేరకే తాము ఈవిధంగా చేస్తున్నట్టు పోలీసుల అదుపులో ఉన్న యువతులు చెప్పినట్టు సమాచారం. లిస్బన్ పబ్ యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని, పబ్ ను సీజ్ చేశారు.
ఒవైసీ ఒత్తిడికి కేసీఆర్ లొంగిపోయాడు: బీజేపీ నేత లక్ష్మణ్