telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నిజామాబాద్ బరిలో ఉన్న రైతులకు .. కూరగాయలే గుర్తులుగా ఈసీ ..

election notifivation by 12th said ec

టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితపై నిజామాబాద్‌లో పోటీకి దిగిన రైతులకు కూరగాయల గుర్తులను ఈసీ కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాకతాళీయయో, యాదృచ్ఛికమో కానీ.. కూరగాయలను ఎన్నికల గుర్తులుగా మార్చేసిన ఈసీ వారికి ఎన్నికల గుర్తులుగా ఇచ్చేసింది. ఈ ఎన్నికల్లో 178 మంది రైతులు బరిలో ఉన్నారు. ఇంత మందికి గుర్తులు కేటాయించడం కత్తిమీద సామే. అన్ని గుర్తులను ఎక్కడి నుంచి తేవాలని తలలపట్టుకున్న ఈసాకి కూరగాయలు, పండ్లు కనిపించాయి. అంతే.. ఒక్కో కూరగాయను ఒక్కో అభ్యర్థికి కేటాయించింది. పాతకాలం నాటి కల్వం (చిన్నసైజు రోలు), రోకలి, ఇసుర్రాయి వంటి వాటిని కూడా గుర్తులుగా కేటాయించి పాతకాలం నాటి చెరిగిపోయిన జ్ఞాపకాలను ఈసీ మరోమారు గుర్తు చేసింది.

చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, వంటపాత్రలను కూడా ఎన్నికల అధికారులు వదల్లేదు. ఇక, కూరగాయలు, పండ్లు విషయానికి వస్తే బెండకాయ, క్యాబేజీ, అల్లం, పచ్చిమిర్చి, బెంగళూరు మిర్చి, నూడల్స్, చాక్లెట్స్, పళ్లెం, ద్రాక్ష గుత్తి, సెల్‌ఫోన్ చార్జర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ మౌస్, బిస్కెట్లు, ఐస్ క్రీం, కేకు, బఠానీలు, వాటర్ హీటర్, స్విచ్ బోర్డు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 178 మంది రైతులకు ఇదే విధంగా కేటాయించింది ఈసీ.

Related posts