telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

trump usa

డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.. అయినా తన ఓటమిని అంగీకరించని ఆయన.. కోర్టులను కూడా ఆశ్రయించారు.. అయితే, మొత్తానికి తన పరాజయాన్ని అంగీకరించిన ట్రంప్.. తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. క్రిస్మస్‌ను పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్… అతిథులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్‌.. ఈ నాలుగేళ్లు చాలా అద్భుతంగా గడిచాయి.. మరో నాలుగు సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని భావించాం… దానికోసం ఎంతగానో శ్రమించాం.. పోరాటం చేశాం.. కానీ, దురదృష్టవశాత్తు ఓటమిపాలయ్యాం… అయితే, మరో నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను.. అంటూ పరోక్షంగా 2024 ఎన్నికల్లో తన మనసులోని భావాలను బహిర్గతం చేశారు.. దూకుడుగా నిర్ణయాలు తీసుకునే డొనాల్డ్ ట్రంప్.. అప్పటి వరకు రాజకీయాల్లో కొనసాగుతారా? లేక.. విశ్రాంతి తీసుకుని మళ్లీ ఎన్నికల సమయంలో రంగ ప్రవేశం చేస్తారా? అనే చర్చ సాగుతోంది.. కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts