కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను ఆహారంగా అందించి.. గర్భంతో ఉన్న ఏనుగును వధించిన ఘటనపై బుధవారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటనను కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏనుగుకు ఆ పరిస్థితి రావడానికి బాధ్యులైన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం పినరయ్ విజయన్ స్పష్టం చేశారు. ఆ దిశగా కేరళ అటవీ శాఖ విచారణ ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రతన్ టాటా ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి…’’ అని టాటా తన పోస్టులో డిమాండ్ చేశారు.
— Ratan N. Tata (@RNTata2000) June 3, 2020