telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాకింగ్ కోసం బయటకొచ్చిన అల్లు అర్జున్… పిక్ వైరల్

Allu-Arjun

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో షూటింగులు లేక సినీ ఇండస్ట్రీ అంతా ఇంటికే పరిమితం అయింది. ప్రస్తుతం సెలూన్లు తెరుస్తున్నప్పటికీ అక్కడికి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. లాక్‌డౌన్‌లో గడ్డం, మీసాలు పెంచేసిన అల్లు అర్జున్‌ సుకుమార్‌ సినిమా ‘పుష్ఫ’లో ఇదే గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మాసిన గడ్డం, పాత బట్టలతో ఉన్న బన్నీ లుక్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో బన్నీ తన ఇంటి నుంచి బయటకు వచ్చి వాకింగ్‌ చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఆయన సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి సరుకులు కూడా కొనుగోలు చేశారు. అప్పట్లోనే బన్నీ లుక్‌ వైరల్ అయింది. తాజాగా బన్నీ, బౌన్సర్లతో బయటకు వచ్చాడు. బన్నీ కనపడగానే ఒక స్థానికుడు ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. ఫొటో తీయొద్దని బౌన్సర్లు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.

Related posts