యూనిట్ కి ఎంత వేసినా 178 యూనిట్లకు 23 కోట్ల బిల్లు కాదు, కానీ కొన్ని సాంకేతిక కారణాలతో ఈ బిల్లు వచ్చినట్టు తేల్చారు. అయితే దానిని చూసిన వినియోగదారుడు మాత్రం ఒక్క క్షణం షాక్ కు గురయ్యాడు. వివరాలలోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 178 యూనిట్ల విద్యుత్ వినియోగం చేసిన ఓ ఇంటికి రూ. 23 కోట్ల కరెంట్ బిల్లు వేశారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని అబ్దుల్ బసిత్ మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు తన ఇంటికి వేసిన కరెంట్ బిల్లు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం బిల్లులా ఉందన్నారు. 178 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ. 23,67,71,524లు వేశారని తెలిపారు. తన జీవిత కాలం మొత్తం సంపాదించిన ఈ బిల్లును చెల్లించలేను అని చెప్పారు.
దీనిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాదాబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ కరెంట్ బిల్లుపై విచారణ చేయిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు అధిక మొత్తంలో బిల్లు జనరేట్ అవుతుందని తెలిపారు. ఈ తప్పిదాన్ని సరిచేసిన తర్వాతే వినియోగదారుడు కరెంట్ బిల్లు చెల్లించొచ్చు అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్పష్టం చేశారు.
ఏడు నెలల్లోనే రూ.35 వేల కోట్ల అప్పులు: యనమల