telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్యాన్సీ రేటుకు రామ్ “రెడ్” శాటిలైట్ రైట్స్

Red

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన మాళవికా శర్మ హీరోయిన్ గా నటించగా నివేతా పెతురాజ్ కీలక పాత్రలో నటించింది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు నిన్న చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులకు మంచి ఫ్యాన్సీ రేటు పలికినట్టు తెలుస్తోంది. 13.5 కోట్లు ఆఫర్ చేసి ఆ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కోవిడ్ రెసిషన్ సమయంలో రామ్ చిత్రానికి ఇంత రేటు రావడం గొప్పేనని అంటున్నారు.

Related posts