telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఒకేరోజు ఒకే ఆసుపత్రిలో పుట్టారు… ఆ క్షణమే… !?

Marriage
షానా గ్రేసీ, టామ్ మాగ్వైర్ అనే ఇద్దరూ గ్రేటర్ మాంచెస్టర్‌లోని ఓ ఆసుపత్రిలో 1992 డిసెంబరు 22న జన్మించారు. 18 ఏళ్ల తరువాత అనుకోకుండా ఒకరికొకరు పరిచయం అయ్యారు. అది కూడా వారిద్దరి పుట్టిన రోజైన డిసెంబరు 22నే మొదటిసారి కలవడం విశేషం. ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పుట్టినరోజు వేడుకల్లో కలిసిన వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా స్నేహితులగా మారారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. షానాను చూసిన క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయానని, అయితే ఆమెను ఒప్పించడానికి మాత్రం చాలా సమయమే పట్టిందని టామ్ చెప్పుకొచ్చాడు. “టామ్ ప్రేమిస్తున్నానని చెప్పినప్పడు నాకు చాలా కోపం వచ్చింది. మనం కేవలం స్నేహితులగానే ఉన్నాం, ఉంటాం అని చెప్పా. కానీ ఒకరోజు రాత్రి ఇద్దరం బయటికి వెళ్లినప్పడు టామ్‌ ఎందుకో కొత్తగా కనిపించాడు. 8 ఏళ్ల నుంచి మేమిద్దరం కలిసి ఉంటున్నాం. టామ్ కంటే మంచివాడు నాకు ఇంకెవరు దొరుకుతారు అని అనిపించింది. అంతే ఆ మరుక్షణమే తన ప్రేమను అంగీకరించేశాను” అని షానా చెప్పుకొచ్చింది. టామ్ లాంటి వ్యక్తిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని, లక్షల్లో ఒకరు టామ్ లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారని షానా అతడిపై ప్రశంసలు కురిపించింది. ఇలా ఒకరికొకరు పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరు అతిత్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. వీరి గురించి తెలిసిన వారు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

Related posts