telugu navyamedia
సినిమా వార్తలు

హ్యాపీ బ‌ర్త్‌డే మై ప్రిన్సెస్… ఐష్ కు అభిషేక్ బచ్చన్ విషెస్

Ish

ఐశ్వర్య రాయ్ అందానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. 1994లో మాజీ మిస్ వ‌రల్డ్ కిరీటాన్ని అందుకున్న ఐశ్వ‌ర్య‌రాయ్ నాలుగు ప‌దుల‌ వ‌య‌స్సులోను కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటోంది. కాగా… ఐశ్వ‌ర్య‌రాయ్ నేడు 46వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆమె స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు ఐష్‌కి సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక ఐష్ భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాపీ బ‌ర్త్‌డే మై ప్రిన్సెస్ అంటూ విష్ చేశారు. ప్ర‌స్తుతం ఈ జంట రోమ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది ఐష్ బ‌ర్త్‌డే వేడుకలు రోమ్‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్‌లు కుచ్ న క‌హో అనే చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఏప్రిల్ 20, 2017లో వీరి వివాహం ముంబైలో ఘ‌నంగా జ‌రిగింది. 2011 న‌వంబ‌ర్‌లో వీరికి ఆరాధ్య అనే చిన్నారి జ‌న్మించిన విష‌యం విదిత‌మే. కాగా ఇప్పుడు అభిషేక్ బచ్చన్ చేసిన ఈ పోస్ట్ లో ఐశ్వర్యారాయ్ నిజంగానే ప్రిన్సెస్ లా ఉంది.

 

View this post on Instagram

 

Happy birthday Principessa!!! ❤️

A post shared by Abhishek Bachchan (@bachchan) on

Related posts