telugu navyamedia
సినిమా వార్తలు

దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఆయన సేవలు మరువలేనివి! 

Dasari Memorial Needa Trust
తెలుగు సినీ పరిశ్రమకు స్వర్గీయ దాసరి నారాయణ రావు చేసిన సేవలు మరువలేనివని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్ ఫిలిమ్ చాంబర్ లో నిర్వహించిన దాసరి నారాయణ రావు-దాసరి పద్మ ‘నీడ’ చారిటేబుల్ ట్రస్ట్  వారి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన మన మధ్యనే ఉంటాడని అన్నారు. ఎవరికి కష్టమొచ్చిన తన కష్టంగా భావించి అండగా నిలబడ్డ గొప్ప వ్యక్తి దాసరి అని అభివర్ణించారు. 
సినీ రంగంలోనే కాకుండా నాటక రంగానికి కూడా ఆయన ఎనలేని సేవలందించాడని కొనియాడారు. ఆయన మాకు దేవుడి లాంటి వాడని ‘నీడ ఫౌండేషన్’ ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలని ఆకాక్షించారు. బాల్యంలో ఎంతో కష్టపడి విద్యావంతుడైన దాసరి ప్రతి ఒక పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేదుకు ఆర్టిక సాయం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా దాసరి సంస్థలో పని చేసిన సినీమా ఆర్టిస్టులకు, ఆయన కారు డ్రైవరు కు చెక్కులను అందజేశారు. 
ఆనతరం ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ దాసరి అద్బుతమైన సేవాగుణం కలిగిన వ్యక్తి  అని కొనియాడారు. 46 సంవత్సరాలుగా ఆయనతో ఉన్న స్నేహబంధాన్ని గుర్తు చేశారు. గత పది సంవత్సరాలుగా 7 నుంచి 8 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసి పలువురిని ఆదుకున్న మహావ్యక్తి దాసరి నారాయన్ రావు అని అన్నారు. పరిశ్రమలో వెనుక బడిన ఆర్టిస్టులకు ప్రతినెలా వేతనంలా డబ్బులు పంపించిన దయాహృదయుడు దాసరి అని ప్రశంసించారు.
Dasari Memorial Needa Trust
  నటుడు నారాయణమూర్తి మాట్లాడుతూ ఆప్యాయత, ఆధారణ, అండ, నీడ మాగురువు మహనీయుడు దాసరి అని అభివర్ణించారు. విద్య అనేది ఎంతో ముఖ్యమని, చదువుంటే ప్రపంచంలో ఎంతో రాణించచ్చని అన్నారు. అందుకనే పేద విద్యార్థులకు చదువు భారం కాకుండా ఎందరో విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయమందించి ఆదుకొన్న మాహా వ్యక్తి దాసరి అని అన్నారు. 
Dasari Memorial Needa Trust
ఆర్టిస్ట్ సత్యం మాట్లాడుతూ యనకు మిత్రునిగా, శిష్యునిగా 54 యేళ్ళ స్నేహ ప్రయాణం మా ఇరువురి మధ్య ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే ప్రతి విషయంలో పట్టు సాధించి నేగ్గేవాడని తెలిపారు. అద్భుతమైన సేవగుణం కలిగిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. నీడ ట్రస్ట్ ను ముందుకు సాగిస్తున్న దాసరి కూతురు హేమలయ కుమారి, అల్లుడు డాక్టర్ రఘునాథ్ ను అభినందించారు.
 అల్లుడు డాక్టర్ రఘునాథ్ మాట్లాడుతూ మామగారు ఎంతో సేవ దృక్పదంతో ఎందరికో చేయూతనిచ్చాడని,  నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తనవంతుగా ఆర్థిక సాయమందించి నీడ ట్రస్ట్ ను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మనుమడు ధనుష్ మాట్లాడుతూ తాత గారి మార్గంలో తానుకూడా నడుస్తూ పేద విద్యార్థులకు తనవంతు సాయమందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ఆర్టిస్టులు, నాటకరంగ ప్రముఖులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Related posts