యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట రామ్. అప్పుటి వరకు కరోనా ప్రభావం తగ్గుతుందని దర్శకనిర్మాతలు కూడా భావిస్తున్నారట. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు విడుదల ఆగిపోయిన సినిమాల్లో చాలావరకు సంక్రాంతిని టార్గెట్ చేస్తాయి. అప్పుడు రామ్ సినిమాకు భారీ పోటీ తప్పదు.