telugu navyamedia
సినిమా వార్తలు

బ్రాండ్ అంబాసిడర్ గా సమంత… నెటిజన్లు ఫైర్

Samantha

సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది నటీనటులకు యూత్ లో భారీ క్రేజ్ ఉంటుంది. కొన్ని భారీ సంస్థలు ఆ క్రేజ్ ను తమ సంస్థల కోసం ఉపయోగించుకుని క్యాష్ చేసుకోవాలని, తమతమ బ్రాండ్ లకు మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తారు. సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న నటీనటులు కూడా ఆయా సంస్థల బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తూ భారీ పారితోషికాలు అందుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం ఈ పనివల్ల విమర్శలు ఎదుర్కోక తప్పదు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి ఇంటి కోడలు సమంత “కుర్ కురే” ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇది ఆరోగ్యానికి హానికరమైన ప్రొడక్ట్ అని, దయచేసి ఇలాంటి వాటికి సపోర్ట్ చేయొద్దని కోరుతున్నారు. కొంతమంది మాత్రం “కుర్ కురే” ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా డబ్బు కోసం ఇలాంటి పని చేస్తావా ? అంటూ ఫైర్ అవుతున్నారు.

గతంలో “కుర్ కురే”కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మంచి లక్ష్మీ కూడా ఇలాగే విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు సమంత వంతు వచ్చిందన్నమాట. మరి అభిమానులకు దీని గురించి సమంత ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

Related posts