telugu navyamedia
సినిమా వార్తలు

వాళ్ళ ప్రశ్నలను మనం కాపీ కొట్టొద్దు..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ హీరోల‌గా ద‌ర్శ‌ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌'(రౌద్రం రణం రుధిరం). ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలన కొద్ది గంటల్లో రికార్డ్స్ సృష్టిస్తోంది. 

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ మొద‌లు పెట్టేశారు చిత్రయూనిట్ . ఈ నేపథ్యంలో నిన్న బెంగుళూరులో ప్రెస్ మీటి నిర్వహించిన చిత్రయూనిట్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాభట్‌, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.

RRR Movie Press Meet In Hyderabad Heroine Alia Bhatt And Hero Attend - Sakshi

ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి విలేకర్ల సమావేశం మాట్లాడుతూ… అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తీర్చిదిద్దామని రాజమౌళి అన్నారు. ఈ సినిమా ఫిక్షనల్​ స్టోరీ. సినిమా మొత్తం స్నేహం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని..దేశభక్తి ఓ భాగం మాత్రమే అని అన్నారు. తారక్​, చెర్రీ పాత్రలను సమానంగా తీర్చిదిద్దాను. నాటు నాటు పాట కోసం చాలా కష్టపడ్డారు. ఈ పాటకు సంబంధించి మీకు రెండు, మూడు స్టెప్పులు మాత్రమే చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి. ‘దోస్తి దోస్తి’ పాట కోసం సిరివెన్నెలతో పనిచేయడం చాలా అద్భుతం. ఆయనతో పాట రాయించుకోవాలంటే చాలా వేరుగా ఉంటుంది.” దర్శకుడు రాజమౌళి అన్నారు.

అలాగే ఓ జర్నలిస్ట్ అలియాను ఉద్దేశిస్తూ “ఆర్” అనే అక్షరానికి మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. సినిమా టైటిల్ లో కూడా “ఆర్ఆర్ఆర్” ఉంది. మరి సినిమాను, దాని టైటిల్ ను ఎలా ఎంజాయ్ చేశారు? అని అడిగాడు. ఆ ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ వాళ్ళ ప్రశ్నలను మనం కాపీ కొట్టొద్దు అంటూ కౌంటర్ ఇచ్చాడు.

Related posts