తెలుగులో హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. శ్రీవిష్ణు తాజాగా నటించిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అనిష్ దర్శకత్వంలో ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షకునిగా చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. గాలి సంపత్ ట్రైలర్‌ను ఈరోజు ఉదయం 10గంటల 35 నిమిషాలకు విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకధీరుడు రాజమౌళి లాంచ్ చేశారు. కాగా ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
next post
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు