telugu navyamedia
సినిమా వార్తలు

వీడియో వైరల్ : పబ్లిగ్గా ప్రియాంక, నిక్ లిప్ కిస్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య బంధం రోజురోజుకి మరింత బలంగా తయారవుతోంది. వీరిద్దరూ ఎక్కడ ఉన్నా అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. తాజాగా జరిగిన బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకకు ప్రియాంక, నిక్ జంటగా వచ్చారు. ఈ సందర్భంగా జోనస్ బ్రదర్స్ బిల్ బోర్డ్ వేదికపై లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. స్టేజ్ మీద ఆడిపాడుతున్న సమయంలో నిక్ తన భార్య ప్రియాంక దగ్గరకుకు వచ్చి ముద్దిచ్చారు. ఈ లిప్ కిస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేడుకలో జోన్స్ కుటుంబసభ్యులైన కెవిన్ జోనస్ భార్య డానియెల్ జోనస్, గేమ్ ఆఫ్ త్రోన్స్ నటి సోఫీ టర్నర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోని నిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ”మై వైఫ్ ఈజ్ హాట్” అంటూ క్యాప్షన్ పెట్టాడు.

Related posts