telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జున చేతిపై నాగుపాము ట్యాటూ… అర్థమిదే…!

Nag

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం రియాలిటీ షో బిగ్‌బాస్3 కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏడవవారం బిగ్ బాస్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గ‌డ‌చిన ఆరువారాల‌లో ఐదు ఎలిమినేషన్స్‌ జరిగాయి. దీంట్లో భాగంగా హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణి, అషూ ఇంటిని వీడిపోయారు. ఇక ఈవారం అలీ ఇంటిని వీడారు. ఈ షో తాజా ఎపిసోడ్ లో అతిథిగా నేచుర‌ల్ స్టార్ నాని పాల్గొన్నారు. నాగార్జున చేతిపై ఓ కొత్త టాటూ వేయించుకున్నార‌ని దాన్ని ఎవ‌రికీ క‌నిపిచంకుండా దాచి పెడుతున్నార‌ని అన్నారు. ఇక హౌస్‌మేట్స్ అడ‌గ‌టంతో నాగార్జున త‌న ఎడ‌మ చేతిపై ఉన్న దిక్చూచి, నాగుపాము కాంబినేష‌న్‌లో ఉన్న టాటూని చూపిస్తూ దానికి వివ‌ర‌ణ ఇచ్చారు. “నాగుపాముని చూస్తుంటే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. ఇక కంపాస్‌ (దిక్చూచి)లో క‌న్ను నాదే. అంటే నేను ఎప్పుడూ కొత్త విష‌యాల‌ను వెతుకుతుంటానని అర్థం. అలాగే దిక్చూచిలోని క‌న‌ప‌డుతున్న అక్ష‌రం `ఎన్‌` ఉత్త‌ర దిక్కు లేదా నా పేరు(నాగార్జున‌)ని సూచిస్తుంది. ఇక టాటూలోని పాము ద‌గ్గ‌రున్న చుక్క‌లకు అర్థం నాగుపాము కుబుసంను విడిచిపెట్టిన‌ట్టు తాను కూడా గ‌తాన్ని మ‌ర‌చిపోయి కొత్త విష‌యాల‌ను అన్వేషిస్తుంటాను” అని అర్థ‌మంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.

Related posts