జమ్మూకశ్మీర్ లో ఉద్రిక్తత వాతావరణం పై స్పష్టత వస్తుంది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా నివాసంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కశ్మీర్ ను శాంతియుతంగా ఉంచాలని అఖిలపక్షం అభిప్రాయపడింది. తాజా పరిణామాలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇది జమ్మూకశ్మీర్ కు చీకటి రోజని అన్నారు.
అమర్ నాథ్ యాత్రను నిలిపివేయడం ఎప్పుడూ లేదని ఫరూక్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370, 35Aను టచ్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దని కేంద్రానికి స్పష్టం చేశారు. మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని అన్నారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకునేందుకు అన్ని పార్టీల నేతలు ఏకతాటిపై ఉన్నారని, ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.