telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ బీర్ పై .. కరోనా వైరస్ ప్రభావం .. అడుగంటిపోయిన అమ్మకాలు..

karona virus effect on beer sales

కరోనా వైరస్ ఇప్పటికే వందల మంది ప్రాణాలను బలితీసుకుంది. తాజాగా మరో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో.. చైనాలోని వుహాన్ వీధులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టిస్తోంది. అయితే దీని ప్రభావం అటు షేర్ మార్కెట్ వ్యాపారలపైనే కాకుండా.. నార్మల్ వ్యాపారాలపై కూడా పడింది. అటు చైనా చుట్టు ఉన్న పొరుగు దేశాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తిచెందిందంటూ పుకార్లు రావడంతో.. మన దేశంలో కూడా ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ఓ వ్యక్తికి వచ్చిందంటూ పుకార్లు రావడంతో.. దీనిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల స్పందించాల్సి వచ్చింది. కరోనా వైరస్ వచ్చిందన్న వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం చేస్తూ.. రూమర్స్‌ను నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ వైరస్ దెబ్బకు మాత్రం బీర్ల అమ్మకాలు మాత్రం విపరీతంగా పడిపోయాయట. అందుకు కారణం.. ఆ కంపెనీ బీర్ల పేరు కరోనా అని ఉండటమే. ఈ కంపెనీకి చెందిన బీరు ధర కూడా మార్కెట్‌లో దొరుకుతున్న బీర్ల ధరకంటే రెండింతలు ఉంటుంది. అయితే దీని పేరు కరోనా అని ఉండటంతో.. మద్యం ప్రియులు ఈ బీర్ కొనేందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ బీరు తాగితే కరోనా వైరస్ వస్తుందని భయపడుతున్నారట. అంతేకాదు.. ఈ బీరు గురించి ఎక్వైరీ కూడా చేస్తున్నారట. అందులో భాగంగా గూగుల్‌లో కరోనా బీర్ వైరస్ అని టైప్ చేస్తూ.. తెగ వెతుకుతున్నారట. కరోనా బీరు తాగితే కరోనా వైరస్ వస్తుందా అన్న ప్రశ్నలు ఎక్కువగా సర్చ్ చేస్తున్నారట మద్యంప్రియులు. అలా వెతికే వారిలో మన దేశంతో పాటుగా.. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా మద్యం ప్రియులు ఉన్నారట.

Related posts