telugu navyamedia
రాజకీయ వార్తలు

త్వరలో పీఎన్ బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకులు విలీనం: నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

త్వరలోనే పలు బ్యాంకుల విలీనం జరగనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంపై ఆసక్తికర సమాచారం అందించారు. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూబీఐ విలీనం కాబోతున్నాయని, ఈ మూడు బ్యాంకులు ఒకే బ్యాంకుగా ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ఈ మూడు బ్యాంకుల కలయికతో దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంకు రూపుదిద్దుకుంటుందని చెప్పారు.

ఇక, దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా ఏర్పడబోతోందని మంత్రి వెల్లడించారు. పీఎన్ బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకులు ఒకటిగా విలీనం అవుతున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడే బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ఇవేకాకుండా సిండికేట్ బ్యాంకులో కెనరా బ్యాంకు కలిసిపోతుందని, అలహాబాద్ బ్యాంకులో ఇండియన్ బ్యాంకు విలీనం అవుతుందని వివరించారు. తాజా విలీనాల కారణంగా ప్రస్తుతం ఉన్న 27 బ్యాంకుల స్థానంలో ఇకపై 12 బ్యాంకులు మాత్రమే ఉంటాయని తెలిపారు.

Related posts