telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సిన్ వైరస్‌ పంపిణీపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం…

Corona Virus Vaccine

మన దేశంలో రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల దాని వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దీంతో.. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కోవిడ్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు.. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు సీఎస్.. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు 36 లార్జ్ ఐఎల్ఆర్లు(ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు)ను చేర్చారు.. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి చొప్పున ఐఎల్ఆర్‌లు, మిగిలిన 10 జిల్లాలకు మూడు చొప్పున ఐఎల్ఆర్‌లను పంపింది కేంద్ర సర్కార్.. వాక్సినేషన్ కోసం 34 లక్షల సిరంజిలను కూడా జిల్లాలకు పంపించారు అధికారులు. తొలివిడతలో 4 లక్షలకు పైగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేయనున్నారు.. వైద్యారోగ్యం, పారిశుద్ధ్యం, పోలీసులకు తదితర విభాగాల సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్‌ ఉంటుంది.. కోవిన్ యాప్ ద్వారా వాక్సినేషన్ వేయాల్సిన వారి జాబితాను సిద్ధం చేస్తోంది సర్కార్… 50 ఏళ్లకు పైబడిన వారి జాబితాను రూపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమాలోచనలు చేస్తోంది. ఓటర్ల జాబితా లేదా ఆధార్ కార్డులకు అనుసంధానమైన మొబైల్ ఫోన్లకు వాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారంపై విశ్లేషణ చేస్తున్నారు

Related posts