telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మై ఫేవరేట్ బాయ్స్”… కొడుకుతో స్టార్ హీరో పిక్ వైరల్

yash

క‌న్నడ స్టార్ హీరో య‌ష్ “కేజీఎఫ్” చిత్రంతో దేశ వ్యాప్తంగా నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా యష్ భార్య రాధికా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా య‌శ్‌, అత‌ని కొడుకు ఫోటోల‌ని షేర్ చేసింది. ఇందులో ఇద్ద‌రు ష‌ర్ట్ లేకుండా క్యూట్ స్మైల్‌తో క‌నిపిస్తున్నారు. “మై ఫేవరేట్ బాయ్స్” అంటూ రాధికా పండిట్ షేర్ చేసిన ఫోటో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా 7 నెల‌ల ఆయుష్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆక‌ర్షించాడు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే య‌శ్ లేదా ఆయ‌న భార్య రాధికా పండింట్ త‌ర‌చుగా త‌మ ఫ్యామిలీ అప్‌డేట్స్‌ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇటీవ‌ల‌ త‌మ కొడుకుని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. ఇక కాగా యశ్‌- రాధికలు 2016లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, కొడుకు ఆయుష్‌ ఉన్నారు. అక్టోబ‌ర్ 30,2019న వీరికి ఆయుష్‌ జ‌న్మించ‌గా, మే 1న కుమారుడి ఫోటోని షేర్ చేసారు య‌శ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న “కేజీఎఫ్-2” చిత్రంలో నటిస్తున్నారు.

Related posts