telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా… ఈ పని చేసింది ఓ మిలిటరీ అధికారి

Secret-Camera

2017 లో రాయబార కార్యాలయంలోని బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన కేసులో అరెస్ట్ అయ్యాడు ఓ మిలిటరీ అధికారి. వివరాల్లోకి వెళ్తే… న్యూజిల్యాండ్‌కు చెందిన ఆల్‌ఫ్రెడ్ కీటింగ్ అనే 59 ఏళ్ళ సీనియర్ మిలిటరీ అధికారిని గురువారం కోర్టు దోషిగా తేల్చింది. వాషింగ్టన్ రాయబార కార్యాలయంలో ఉన్న బాత్రూంలో కీటింగ్ కెమెరా అమర్చగా.. కెమెరా ప్యానెల్ ఊడి నేలపై పడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జులై 2017లో కీటింగ్‌ను అరెస్ట్ చేయగా, తనకు ఏం తెలీదని చెప్పారు. కెమెరాలోని మీడియా కార్డ్‌ ద్వారా కీటింగ్ డీఎన్‌ఏను కనిపెట్టినట్టు, కెమెరాను పలుమార్లు కీటింగ్ ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. మరోపక్క కీటింగ్ గూడఛారిగా ఏమైనా పనిచేస్తున్నారా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. హెన్రీ స్టీల్ అనే న్యాయవాది మాత్రం కేవలం సహోద్యోగులను రహస్యంగా వీడియా తీయడం కోసమే కీటింగ్ కెమెరాను పెట్టాడని, అతను గూడఛారిగా పని చేయడం లేదని కోర్టుకు తెలిపారు. అసలు కెమెరాను కీటింగ్ అమర్చాడా…? దీనివెనుక మరెవరైనా ఉన్నారా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే జూన్ 25న ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడనుంది. కీటింగ్‌కు 18 నెలల శిక్షను విధించే అవకాశముంది.

Related posts