telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గొప్పోడు అని అంటే ఉబ్బి తబ్బిబ్బవ్వకండి.. సమయం చూసి నొక్కుతారు… నాగబాబు పోస్ట్ వైరల్

Nagababu

ఇండస్ట్రీ పెద్దల మీటింగ్‌కి చిరంజీవి.. బాలయ్యను పిలిచి ఉండాల్సిందని కొందరు అంటే.. ఆయన పిలిస్తే మాత్రం వస్తారా?? అయితే గత 30 ఏళ్లలో ఆయన ఎన్ని మీటింగ్‌లకు వచ్చారు అనే వారు లేకపోలేదు. ఇదే తరుణంలో బాలయ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ చాలామంది ఇండస్ట్రీ వాళ్లు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఆయన ముక్కుసూటి మనిషి అని, కల్మషం లేని వ్యక్తి అని పోసాని లాంటి సీనియర్ నటులు ప్రశంసలు కురిపించారు. ఇక బాలయ్యపై కాంట్రవర్శి కామెంట్స్‌తో బాగా ఫోకస్ అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు. ఆ మధ్య ఎన్నికల ముందు బాలయ్యపై ఎపిసోడ్‌ల వారిగా వీడియోలను విడుదల చేసి అసలు నాకు బాలయ్య ఎవరో తెలియదు అంటూ వివాదాలను రాజేసిన నాగబాబు.. ఈ మధ్య అదే బాలయ్యను క్షమాపణ చెప్పకపోతే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో నాగబాబు వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడిచింది. తాజాగా నాగబాబు ట్విట్టర్ మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో తెలియదు కానీ… “మనల్ని గొప్పోడు గొప్పోడు అని అంటే ఉబ్బి తబ్బిబ్బవ్వకండి.. సమయం చూసి ఒక్క నొక్కు నొక్కుతారు.. రజినీకాంత్ డైలాగ్ ఇన్ అరుణాచలం” అంటూ పకా పకా నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు నాగబాబు. బాలయ్య-నాగబాబు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న తరుణంలో నాగబాబు మరో ట్వీట్ వదలడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్ పై “పాలకొల్లు లో నొక్కినట్టుగా కదా?” అంటూ నందమూరి అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. 

Related posts