టీడీపీ మొత్తానికి తన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 126 మందికి చోటు దక్కింది. ఇంకా 49 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితాలో ముఖ్యవిషయాలకు వస్తే, ఈ సారి పెద్దలు తప్పుకొని తమ వారసులకు టికెట్ ఇవ్వాలని బాబును అభ్యర్దించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే మొదటి జాబితాలో 10మంది వారసులకు టిక్కెట్లు దక్కాయి. వారిలో సీఎం తనయుడు లోకేష్ ఒకరు. ఆయన మంగళారిగి నుండి పోటీకి దిగుతున్నారు. పలాస నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే శివాజీ కుమార్తె శిరీషకు చోటు దక్కగా, చీపురుపల్లి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు నాగార్జునకు, రాజమండ్రి అర్బన్ నుండి ఎర్రన్నాయుడు కుమార్తె, ఆదిరెడ్డి భవాని తొలిసారిగా ఎన్నికల బరిలో దిగబోతున్నారు.
గుడివాడ నుండి దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్; విజయవాడ వెస్ట్ నుండి జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూస్; పత్తికొండ నుండి కేఈ కృష్ణ మూర్తి తనయుడు శ్యామ్; రాప్తాడు నుండి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ రంగప్రవేశం చేస్తున్నారు. శ్రీకాళహస్తి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ తనయుడు సుధీర్ రెడ్డి; నగిరి నుండి గాలి కుమారుడు భాను ప్రకాష్ రాజకీయ వారసులుగా బరిలో దిగుతున్నారు.
తొలిజాబితాలో మొత్తం 126 మందికి స్తానం దక్కగా అందులో 72 మంది ఓసీలు; 31మంది బీసీలు; 17మంది ఎస్సీలు, 4 ఎస్టీలు మరియు 2 మైనారిటీలు సీటు దక్కించుకున్నారు.