తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి ఆయన పోటీ చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న కేసీఆర్‌ను నామా నాగేశ్వరరావు ఫాంహౌజ్‌లో కలిశారు. టీఆర్ఎస్‌లోకి నామా రాక ఖరారు కావడంతో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి ఆయనను పోటీకి దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ కూడా తమ పార్టీలో చేరమని ఆహ్వానించినప్పటికీ టీఆర్ఎస్ వైపే నామా మొగ్గుచూపుతునట్టు తెలుస్తోంది.
previous post
next post