telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మూడో రోజుకు చేరుకున్న.. దీదీ దీక్ష.. మరో మూడు రోజులు కొనసాగింపు..

satyagraha by mamata continues

కలకత్తాలో సీబీఐ ప్రవేశించి చేసిన హడావుడికి పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ నిరసనగా చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. రాజ్యాంగ పరిరక్షణ దీక్ష పేరిట మమతా బెనర్జీ నిరసన కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8.30 గంటల నుంచి దీదీ దీక్ష చేస్తున్నారు. దీక్ష వేదిక నుంచే మమతా పరిపాలనా వ్యవహారాలను నడుపుతున్నారు.

మరోవైపు దీదీకి మద్దతుగా బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అటు మమతా బెనర్జీ దీక్షకు మిత్రపక్షాల సంఘీభావం తెలిపాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఇప్పటికే దీదీకి మద్దతు ప్రకటించారు. ఇక ఏపీసీఎం బెంగాల్ ప్రయాణం ఎప్పుడైనా ఉండవచ్చని తెలుస్తుంది. అంటే ఆయన కూడా మద్దతు తెలిపి రానున్నారు. ఇప్పటికే మీడియా ద్వారా, సమావేశాల లోను ఈ విషయంపై ప్రస్తావించారు టీడీపీ నేతలు. ఈ విషయంపైనే గత రెండు రోజులుగా లోక్ సభ కూడా గందరగోళంగా తయారైంది. దీనిపై మోడీ తగిన సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్లతో లోక్ సభ సమావేశాలు వాయిదాలతో ముగిసేట్టుగానే ఉన్నాయి. మమతా బెనర్జీ కూడా 8వ తేదీ వరకు దీక్ష కొనసాగిస్తానని ఖరాకండిగా చెప్పేశారు.

Related posts