వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దేశంలోని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ షో ఇప్పటికే పదవ వారానికి చేరుకోగా… ఈ వారం ఎలిమినేషన్ లో శ్రీముఖి, బాబా మాస్టర్, వరుణ్, రవి ఉన్నారు. మరోవైపు కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. మరో 8 రోజులలో ఈ కార్యక్రమంకి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో కార్యక్రమంపై మరింత ఆసక్తి కలిగేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు బిగ్ బాస్ హౌజ్‌లోకి సీజన్ 2 కంటెస్టెంట్స్ మహత్ మరియు యషిక ఎంటర్ అయినట్టు ప్రోమో వీడియోలో చూపించారు. వారిద్దరు ఇంటి సభ్యులతో కలిసి కొద్ది సేపు చర్చించి వెళ్ళేముందు ఫినాలేకి చేరుకునే పోటీదారులకి అభినందనలు తెలిపారు. మొదటి రెండు సీజన్స్ మాదిరిగానే సీజన్ 3 కూడా ఎంతో రసవత్తరంగా సాగుతుండగా, ఈ సీజన్ విజేత ఎవరనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
#Day93 #Promo1 #பிக்பாஸ் இல்லத்தில் இன்று.. #BiggBossTamil – தினமும் இரவு 9:30 மணிக்கு உங்கள் விஜயில்.. #BiggBossTamil3 #VijayTelevision pic.twitter.com/d13U1Ka5Ep
— Vijay Television (@vijaytelevision) 24 September 2019