telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

అతిగా వ్యాయామం చేస్తున్నారా..

మన ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం, ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఆరోగ్యాని కి ఎంతో మంచిది. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తున్నా.. ఓ పరిధి మేరకు, పరిమిత సమయంలోనే చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్సర్‌సైజ్‌ చేస్తే… కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిమితి కి మించి అధికంగా జిమ్‌, ఎక్స్‌ర్‌సైజ్‌ లాంటి శారీరక శ్రమ చేయడం వల్ల తలనొప్పి, డిప్రెషన్‌ సహా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఒకవేళ వర్కౌట్లు అధికంగా చేసినా… మధ్య మధ్యలో కాస్త విరామ సమయం తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రతిరోజూ వర్కౌట్లు అధికంగా చేసినా వీకెండ్‌ రోజు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని.. లేని పక్షంలో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట. తగిన విశ్రాంతి లేకుండా అధికంగా కసరత్తులు, శ్రమ చేస్తే బరువు పెరిగే అవకాశాలున్నాయని 2015 లో ఓ సర్వేలో తేలింది. ఫిట్‌నెస్‌ అంటూ అధికంగా వర్కౌట్లు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Related posts