telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు!

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కొనసాగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా మొత్తం ఏడు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైపవర్‌ కమిటీ నివేదిక, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లు, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విచారణను లోకాయుక్తకు అప్పచెప్పాలని కేబినెట్‌ నిర్ణయించింది.

కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే:

-రాజధాని రైతులకు అదనపు ప్రయోజనం కల్పించాలని నిర్ణయం
-11 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
-పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం.
-రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు
-అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
-విశాఖకు సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు
-అమరావతిలోనే అసెంబ్లీ మూడు సెషన్లు
-కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఆమోదం

Related posts