telugu navyamedia
వార్తలు

భారత్ వెబ్ సైట్లను అడ్డుకుంటున్న చైనా

laptop companies bumper offer on festivals

చైనా యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఇప్పటికే భారత వెబ్ సైట్లను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అడ్డుకుంటున్న విషయం తాజాగా వెల్లడైంది. చైనాలో భారత వెబ్ సైట్లు చూసేందుకు వీల్లేకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది. భారత టీవీ చానళ్లు చూడాలంటే ఐపీ టీవీ ఒక్కటే మార్గమని బీజింగ్ లోని భారత దౌత్య వర్గాలంటున్నాయి. దీన్నిబట్టి అక్కడి కేబుల్ న్యూస్ వ్యవస్థలో భారత టీవీ చానళ్లను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.

చైనాలో వార్తా ప్రసారాలపైనా, ప్రసార సంస్థలపైనా విపరీతమైన సెన్సార్ ఉంటుంది. వీపీఎన్ వంటి నెట్వర్కింగ్ టూల్స్ లేకుండా వెబ్ సైట్లు వీక్షించడం కుదరనిపని. అందుకే చైనా తనకు అభ్యంతరకరం అని భావించిన వెబ్ సైట్లను, టీవీ చానళ్లను ఇంటర్నెట్లో చూసేందుకు వీల్లేకుండా వీపీఎన్ ను నిలువరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది.

Related posts