telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జిని సన్మానించిన సీపీ అంజనీ కుమార్

ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జికి దేశవ్యాప్త ప్రశంసలు వస్తున్నాయి. అంబులెన్స్ కు దారి చూపెట్టి పేషెంట్ ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జి..ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్కరించి బహుమతులు సిటీ cp అంజనీ కుమర్ అందజేశారు. ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్ పరిగెత్తుకుంటూ రెండు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి దారి చూపాడు బాబ్జి. దీంతో బాబ్జి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బాబ్జీ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు సిపి అంజనీ కుమర్ , హైదరాబాద్ పోలీసులు. ఈ సందర్బంగా..ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జి మాట్లాడాడు. అబిడ్స్ లో తాను విధి నిర్వహణ లో ఉన్న సమయంలో ఓ అంబులెన్స్ వచ్చిందని..అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవడం తో వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వెళ్ళానన్నారు. చావుబతుకుల మధ్య ఉన్న రోగిని ఆస్పత్రికి తరలిస్తున్నారని…దీంతో వాహన దారులను పక్కకి వెళ్లాలని చెపుతూ ట్రాఫిక్ దాటించానని పేర్కొన్నారు. సకాలం లో అంబులెన్స్ ఆస్పత్రికి చేరడం తో చావు బతుకులు మధ్య ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని పేర్కొన్నాడు. తనకు చాలా ఆనందంగా ఉంది, మా ఉన్నతాధికారులు నుండి అభినందలు వచ్చాయని తెలిపాడు.

Related posts