telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఇళయదళపతి అభిమానులకు గుడ్ న్యూస్… రాజకీయాల్లోకి విజయ్

Vijay

గత కొన్ని రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు విన్పిస్తున్నాయి. మరోవైపు ‘రావాలి విజయ్..కావాలి విజయ్’ అనే నినాదంతో సినీ హీరో విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్ రాబోతున్నాడనే వార్త మరోసారి హల్చల్ చేస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ పేరును కూడా ఎన్నికల ‌సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం. “విజయ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ”గా పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆయన పార్టీకి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. “ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకం” విజయ్ పార్టీ పేరు. అయితే విజయ్ “పీపుల్స్ ఉద్యమం”గా వున్న సంస్థను పార్టీగా ప్రకటించారు. ఇటీవల విజయ్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాను నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా సెట్స్‌కు వెళ్లి మరీ ఐటీ అధికారులు ఆయన్ను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. అయితే ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా చేసిందని ఆయన అభిమానులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై పదే పదే మండిపడుతోన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు ఎప్పటి నుంచో విన్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ నటించిన తాజా చిత్రం “మాస్టర్” సంక్రాంతికి విడుదల కానుంది.

Related posts