telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాయలసీమ కు .. మరో హెల్త్ యూనివర్శిటీ ..

AP

మొదటి నుండి వెనుకబడిన ప్రాంతంగా ఉంటున్న రాయలసీమను మరింతగా అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన అనుమతులు, నిధులను అందజేయాలని కోరుతూ త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించనుంది. తిరుపతిలో.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో పనిచేస్తోన్న శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యోచన. దీనిపై అధ్యయనం చేయడానికి త్వరలోనే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అదనంగా ఇది పనిచేస్తుంది. తిరుపతిలో ఇప్పటికే అన్ని వసతులతో కొనసాగుతున్న స్విమ్స్ కేంద్రంగా హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను దీని పరిధిలోకి తీసుకుని రావాలని ప్రాథమికంగా నిర్ణయించింది ప్రభుత్వం.

ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క హెల్త్ యూనివర్శిటీ మాత్రమే ఉంది. 1986లో అప్పటి ప్రభుత్వం విజయవాడలో దీన్ని నెలకొల్పింది. విజయవాడ శివార్లలోని గుణదలలో 1986 నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాలను పురస్కరించుకుని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దీన్ని ప్రారంభించారు. 1998లో ఆ యూనివర్శిటీ పేరును మార్చారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు.

Related posts