కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తాజా పరిస్థితిని వివరించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ లాక్‌డౌన్ లాంటి కఠిన చర్యలు చేపట్టకుంటే.. మనదేశంలో వైరస్ సంక్రమణ సంఖ్య రెండు లక్షలు దాటేదన్నారు. అందుకే లాక్‌డౌన్, కంటైన్మెంట్ చర్యలు చాలా అవసరమని తెలిపారు.
దేశంలో 586 కోవిడ్ హాస్పిటళ్లు ఉన్నాయని, సుమారు ఒక లక్ష ఐసోలేషన్ బెడ్స్ ఉన్నట్లు తెలిపారు. క్వారెంటైన్ సెంటర్లలో సేవలు అందిస్తున్న వైద్య , పోలీసు సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ సెక్రటరీ సలిలా శ్రీవాత్సవ్ తెలిపారు.