సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగి పోయింది. ప్రశంసలైనా, విమర్శలైనా సోషల్ మీడియా వేదికగానే జరుగుతున్నాయి. అయితే కొన్నిసార్లు మాత్రం విమర్శలు అదుపు తప్పుతున్నాయి. నటీనటుల పర్సనల్ జీవితాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి నెటిజన్ల విమర్శలు. తాజాగా హీరోయిన్ ప్రియా ఆనంద్ గురించిన ట్వీట్ ఒకటి అలాగే వివాదాస్పదమైంది. ప్రియా ఆనంద్‌ను ట్విటర్‌లో ఓ నెటిజన్ తీవ్రంగా కామెంట్ చేసారు. ‘‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలో శ్రీదేవితో కలిసి ప్రియా ఆనంద్ నటించారు. ఆమె ఇటీవల చనిపోయారు. తాజాగా ‘ఎల్‌కేజీ’ సినిమాలో ప్రియా ఆనంద్‌తో కలిసి నటించిన సహనటుడు జేకే రితీశ్ కూడా మృతి చెందారు. ఆమెతో పనిచేస్తే దురదృష్టవంతులు అవుతారా..?” అంటూ ట్వీట్ చేశాడు నెటిజన్.
ఈ ట్వీట్ చూసి బాధపడిన ప్రియా ఆనంద్ అతన్ని సున్నితంగానే మందలించారు. ‘‘నీలాంటి వ్యక్తుల మాటలకు సాధారణంగా నేను స్పందించను. కానీ నీ వ్యాఖ్యలు కఠినమైనవని నీకు తెలిపేందుకు రిప్లై ఇస్తున్నా. సోషల్‌మీడియాలో ఇలాంటి కామెంట్లు చూసి మౌనంగా ఉండిపోవడం సులభమే. కానీ నీ మాటల వల్ల ప్రజలు ఎంత బాధపడుతారో ముందు తెలుసుకో. కాబట్టి ఇలాంటి ట్వీట్లు చేసే ముందు ఓ నిమిషం ఆలోచించి.. దయ, మానవత్వంతో వ్యవహరించు’” అని ప్రియా రిప్లై ఇచ్చారు.
ఇది చూసిన సదరు నెటిజన్ “నన్ను క్షమించండి. నా తప్పును ఒప్పుకుంటున్నా. ఇవాళ నేను ‘ఇంగ్లిష్ వింగ్లిష్’, ‘ఎల్‌కేజీ’ సినిమాలు చూశా. మీరే రెండింటిలో కామన్‌గా ఉన్నారు. అప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చింది. అందుకే అలా ట్వీట్ చేశా. మీరు ట్వీట్లు చదవరు అనుకున్నా. నేను అలా మాట్లాడినా.. మీరు ప్రేమగానే సమాధానం ఇచ్చారు” అని అన్నారు. ఇక ప్రియా ఆనంద్ తెలుగులో “లీడర్, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘180’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు .
బాలకృష్ణపై కంగనా రనౌత్ కామెంట్స్