కరోనా వల్ల లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల విషయమై టెన్షన్ పడుతున్నారు. ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని పరిస్థితులు రావడంతో చిన్న చిత్రాలు నిర్మాతలు, వారు తీసిన సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘పెంగ్విన్’ కూడా ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. తమిళం, తెలుగు వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ తో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. జూన్‌లో ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఇప్పటికే ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాగా, తమిళంలో జ్యోతిక లీడ్ రోల్ లో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా, హిందీ చిత్రం లక్ష్మీ బాంబ్ కూడా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల అనుష్క నటించిన నిశ్శబ్ధం కూడా ఓటీటీలో విడుదల అవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.
previous post
నా కాపురంలో ఇప్పులు పోశాడు… ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి : సింగర్ ఫైర్