మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలంతా ఇటీవల సమావేశమయ్యారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యలు, షూటింగ్ లకు అనుమతులు వంటి వాటిపై చర్చించారు. ఈ సమావేశానికి బాలకృష్ణ తప్ప మిగతా వాళ్ళు హాజరయ్యారు. ఇదే విషయం పై స్పందించిన బాలయ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బాలయ్య వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇవ్వడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టైంది. తాజాగా నాగబాబు తనయుడు, మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. `చేతిలో తుపాకీ ఉన్న మనిషితో ఎవరూ మాట్లాడలేరు` అని వరుణ్ ఓ ట్వీట్ చేశాడు. `వాల్మీకి` సినిమాలోని తన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. బాలయ్యను ఉద్దేశించే వరుణ్ ఈ ట్వీట్ చేశాడని కొందరు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ ట్వీట్ ఏ ఉద్దేశ్యంతో చేసాడో వరుణ్ కే తెలియాలి.
You can’t talk to a man, with a gun in his hand! pic.twitter.com/VA6vjNU4K3
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) May 28, 2020