telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగచైతన్య బర్త్‌ డే‌… స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చిన లవ్‌స్టోరీ టీం

అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు నాలుగు నెలల పాటు తాత్కాలికంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తయింది. తాజాగా నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ రిలీజ్ చేసి… స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ఈ కొత్త పోస్టర్లో నాగ చైతన్య బనీన్‌, లూంగీతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఇటీవలే ఈ సినిమా నుంచి సాయిపల్లవి, నాగచైతన్య పెళ్లి పీటలపై ఉన్ పోస్టర్‌ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related posts