telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కొత్త చట్టం .. జంతుప్రేమికులకు .. తప్పని చలానాలు..

challan for pets on road

కొత్త వాహన చట్టం తో వాహనదారులు భయపడుతూనే ఉన్నారు. అన్ని పత్రాలను జాగ్రత్తగా దాచుకుంటున్నారు. వాహనం బయటకు తీసుకెళ్లే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఒక్కసారి చలానా కట్టాలి అంటే.. వచ్చే నష్టం అంతాఇంతా కాదు. బయటకు వెళ్లే సమయంలో అన్ని చూసుకొని బయటకు వెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతున్నది. అన్ని ఉన్నా ఏదో ఒకటిలేదని చలానాలు వేయడం దారుణంగా మారింది. బండి నెంబర్ ప్లేట్ విషయంలో, ఆటోలో సీటు బెల్టు, కారులో హెల్మెట్ వంటి విచిత్రమైన విషయాలు చెప్పి జరిమానాలు విధిస్తున్నారు. ఈ జరిమానాలు కారణంగా పాపం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడ్డగోలుగా విధించే పన్నులకు భయపడుతున్నారు.

ఇప్పటి వరకు వాహనాలకు మాత్రమే జరిమానాలు పడ్డాయి. ఇప్పుడు పెంపుడు జంతువులకు కూడా పన్ను వేయబోతున్నరాట. పన్ను వేయడం కాదు.. ఇప్పటికే వేసినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో పెంపుడు కుక్కలు, ఇతర జంతువులను పెంచుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ కు రూ. 5వేలరూపాయలు పన్ను కట్టి అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి తీసుకున్నాకే వాటిని పెంచుకోవాలి. ఈ పన్ను విధించడం వెనుక కారణం ఉన్నది. అదేమంటే, కుక్కలు ఇతర జంతువులను తీసుకొని రోడ్డుపైకి వచ్చినపుడు ఆ జంతువులు రోడ్లపైనే విసర్జిస్తున్నాయి. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది క్లీన్ చేయాల్సి వస్తుంది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, రోడ్లపైకి జంతువులను తీసుకొని వచ్చినపుడు అవి కనుక బహిరంగంగా బయట మలవిసర్జన చేస్తే వాటిని వాటి యజమానులు క్లీన్ చేయాలి.. దాంతో పాటు రూ. 500 ఫైన్ కట్టాలి. ఇప్పటికే ఈ చట్టం ఢిల్లీలో అమలులో ఉన్నది.

Related posts