ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సాహో” సినిమాలోని “వాళ్లు నా డై-హార్డ్ ఫ్యాన్స్” అనే డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఎంతో మంది వీరాభిమానులున్నారు. అంతకుమించిన స్థాయిలో ప్రభాస్‌ను ఆరాధిస్తున్న ఒక జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. అయితే అమెరికాలో నివసిస్తున్న ఈ జంట ప్రభాస్‌ను తన సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న రాఘవేంద్ర, అతని భార్యకు ప్రభాస్ అంటే ప్రాణం. ఎంత అభిమానం అంటే తాము కొనుక్కున్న కొత్త కారును కూడా ప్రభాస్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేంత. అంతేకాదు వాళ్లు ఏదైనా పండగ చేసుకున్నా, పార్టీ చేసుకున్నా పక్కన నిలువెత్తు ప్రభాస్ ఫోటో ఉండాల్సిందే. వారి ఇంటి నిండా కూడా ప్రభాస్ ఫోటోలే. మరి, ఇంతటి వీరాభిమానులు “సాహో”లాంటి సినిమా రిలీజైతే ఊరుకుంటారా? విడుదలైన తొలి నాలుగు రోజుల్లో ఏకంగా ఏడుసార్లు “సాహో” సినిమాను చూశారట. తమ వీకెండ్ మొత్తాన్నీ “సాహో”కే కేటాయించారట. అంతేకాదు “సాహో” బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని గుడిలో పూజలు కూడా చేయించారట. వీరి అభిమానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
After all the Celebrations and Prayers now heading to Dublin, California to watch #Saaho 7th time… Ending long weekend with our Dearest Darling #Prabhas#SaahoInCinemas @SaahoOfficial @UV_Creations @sujeethsign @ShraddhaKapoor @SKNonline pic.twitter.com/A78xEdGS6E
— Srinidhi Udupi Raghavendra (@srinidhi_ur) September 3, 2019